637 బంతుల తర్వాత తొలి సిక్స్‌..!

Shardul Thakur ends Indias six drough - Sakshi

లీడ్స్‌: ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు.. ఆరు బంతుల్లో ఏడు సిక్సర్లు(నోబాల్‌ సాయంతో) మనం గతంలో చూసి ఉన్నాం. అయితే 637 బంతుల తర్వాత తొలి సిక్స్‌ అంటే కాస్త కొత్తగానే ఉంటుంది. అందులోనూ పటిష్టమైన టీమిండియా ఈ తరహా చెత్త రికార్డును నమోదు చేసిందంటే మరికాస్త విడ్డూరంగా అనిపిస్తుంది.

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో విరాట్‌ నేతృత్వంలోని టీమిండియా ఒక సిక్స్‌ను సాధించడానికి ఆరు వందలకు పైగా బంతులు ఆడింది. తొలి వన్డే చివర్లో సిక్స్‌ సాధించిన టీమిండియా.. రెండో వన్డేలో మాత్రం కనీసం సిక్స్‌ను నమోదు చేయలేకపోయింది. ఇక మూడో వన్డేలో టీమిండియా తన ఇన్నింగ్స్‌ చివర్లో సిక్స్‌ను కొట్టింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా బెన్‌ స్టోక్స్‌ వేసిన 48 ఓవర్‌ తొలి బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ బంతిని సిక్స్‌గా మలచాడు. దాంతో రెండు మ్యాచ్‌లకు గాను టీమిండియా ఖాతాలో మొదటి సిక్స్‌ చేరింది. అదే ఓవర్‌ ఐదో బంతిని సైతం శార్దూల్‌ మరో సిక్స్‌ కొట్టాడు. దాంతో భారత్‌ ఇన్నింగ్స్‌లో రెండో సిక్స్‌ వచ్చి చేరింది. ఇక‍్కడ ఒక బౌలర్‌ భారత్‌ ఖాతాలో సిక్స్‌ లేని కొరతను తీర్చడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టీమిండియా 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఏడేళ్ల తర్వాత టీమిండియా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top