కేంద్ర క్రీడల మంత్రిని కలిసిన శాట్స్‌ చైర్మన్‌ | sats chairman meets rajyavardhan singh rathore | Sakshi
Sakshi News home page

కేంద్ర క్రీడల మంత్రిని కలిసిన శాట్స్‌ చైర్మన్‌

Jan 18 2018 10:21 AM | Updated on Jan 18 2018 10:21 AM

sats chairman meets rajyavardhan singh rathore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి మంగళవారం కేంద్ర కీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ను కలిసి సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మాణ ప్రతిపాదన పత్రాలు అందజేశారు. గ్రేటర్‌ నోయిడాలో నిర్వహించిన నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌– 2018 ముగింపు కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రిని కలిసిన వెంకటేశ్వర్‌ రెడ్డి వరంగల్‌ (అర్బన్‌), సరూర్‌నగర్‌ స్టేడియాలలో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు నిధులు మం జూరు చేయాలని కోరారు.

‘ఖేలో ఇండియా’ కింద ఉస్మానియా వర్సిటీలో క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ను సందర్శించాలని కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement