ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాళ్ల దాడి | Rock thrown at Australia cricket team bus in Guwahati | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాళ్ల దాడి

Oct 11 2017 9:41 AM | Updated on Oct 11 2017 11:11 AM

Rock thrown at Australia cricket team bus in Guwahati

గువాహటి : రెండో ట్వంటీ-20 మ్యాచ్‌ ముగిసిన తర్వాత హోటల్‌కు వెళ్తున్న ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై మంగళవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బస్సు అద్దం ధ్వంసమైంది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్‌ ట్వీట్‌ చేశారు.

హోటల్‌కు వెళ్తున్న దారిలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాయి విసరడం ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. పగిలిన బస్సు అద్దం ఫొటోను కూడా ట్వీట్‌కు జత చేశారు ఫించ్‌. రాయి విసిరినప్పుడు విండో సీట్‌లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని క్రికెట్‌ ఆస్ట్రేలియా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

కానీ, ఈ ఘటన క్రికెటర్లను ఆందోళనకు గురి చేసినట్లు తెలిపింది. ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది. క్రికెటర్లకు కల్పించిన భద్రతపై తాము సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement