విరాట్ ను అధిగమించాడు! | raina surpasses virat kohli in overall ipl runs | Sakshi
Sakshi News home page

విరాట్ ను అధిగమించాడు!

Apr 7 2017 9:19 PM | Updated on Sep 5 2017 8:11 AM

విరాట్ ను అధిగమించాడు!

విరాట్ ను అధిగమించాడు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఓవరాల్ అత్యధిక పరుగుల రికార్డులో మరోసారి విరాట్ కోహ్లిని సురేష్ రైనా వెనక్కునెట్టాడు

రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఓవరాల్ అత్యధిక పరుగుల రికార్డులో మరోసారి విరాట్ కోహ్లిని సురేష్ రైనా వెనక్కునెట్టాడు. ఇద్దరి మధ్య దోబూచులాడుతున్న టాప్ ప్లేస్ ను రైనా మరోసారి ఆక్రమించాడు. గత ఏడాది రైనాను అధిగమించి కోహ్లి ప్రథమ స్థానాన్నిదక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఓవరాల్ పరుగుల్లో విరాట్ 4,110 పరుగులు సాధించగా, ఆ రికార్డును తాజాగా రైనా సవరించాడు.


ఐపీఎల్-10 సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ రైనా ఆ రికార్డును సవరించాడు. ఈ మ్యాచ్ కు ముందు 4,098 పరుగులతో ఉన్న రైనా 23 పరుగుల మార్కును చేరిన తరువాత కోహ్లిని దాటేశాడు. తాజా మ్యాచ్ లో రైనా హాఫ్ సెంచరీ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement