‘ఆ ఇద్దరు’ ఎప్పటి వరకు? | Rahul Dravid questions Yuvraj Singh, MS Dhoni's roles in India's 2019 | Sakshi
Sakshi News home page

‘ఆ ఇద్దరు’ ఎప్పటి వరకు?

Jun 21 2017 1:17 AM | Updated on Sep 5 2017 2:04 PM

‘ఆ ఇద్దరు’ ఎప్పటి వరకు?

‘ఆ ఇద్దరు’ ఎప్పటి వరకు?

భారత క్రికెట్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీనియర్‌ ఆటగాళ్లు ఎమ్మెస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌లపై కీలక నిర్ణయం

 ధోని, యువరాజ్‌లపై నిర్ణయం తీసుకోవాలన్న ద్రవిడ్‌  
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీనియర్‌ ఆటగాళ్లు ఎమ్మెస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌లపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్‌లో జరిగే 2019 వన్డే వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు, మేనేజ్‌మెంట్‌ ఈ దిశగా ఆలోచించాలని ఆయన సూచించారు. ‘రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌కు సంబంధించి రోడ్‌ మ్యాప్‌ను చూస్తే వచ్చే రెండేళ్లలో ధోని, యువీ పాత్ర ఎలా ఉండబోతోంది? నాలుగు, ఐదు స్థానాల్లో ఆడుతున్న వీరిద్దరికీ జట్టులో చోటు ఉంటుందా? లేక ఒక్కరికే అవకాశముందా? వీరి ఆటను వచ్చే ఆరు నెలల్లో లేదా ఏడాది కాలంలో మళ్లీ సమీక్షిస్తారా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న యువ ప్రతిభను వాడుకుంటారా లేక ఈ ఇద్దరు సీనియర్లపైనే ఆధారపడతారా అనే విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.

 వెస్టిండీస్‌ సిరీస్‌లో కూడా తుది జట్టు విషయంలో ప్రయోగాలు చేయలేకపోతే కొన్నాళ్ల తర్వాత పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది’ అని ద్రవిడ్‌ వ్యాఖ్యానించారు. బ్యాటింగ్‌ పిచ్‌లపై ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలు ప్రభావం చూపలేకపోతున్నారన్న ద్రవిడ్‌... బౌలింగ్‌ శైలిలో ప్రత్యేకత ఉన్న స్పిన్నర్లను ఎంపిక చేయాలని సలహా ఇచ్చారు. చాంపియన్స్‌ ట్రోఫీ పరాజయానికి పూర్తిగా ధోని, యువరాజ్‌లే కారణం కాకపోయినా... వారు ఆడుతున్న స్థానాలను బట్టి చూస్తే తుది జట్టు కూర్పు కష్టంగా మారిపోతోందని మరో మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ విశ్లేషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement