మరో చరిత్రపై నాదల్‌ గురి | Rafael Nadal on track for 10th Barcelona open win | Sakshi
Sakshi News home page

మరో చరిత్రపై నాదల్‌ గురి

Apr 30 2017 2:30 AM | Updated on Sep 5 2017 9:59 AM

మరో చరిత్రపై నాదల్‌ గురి

మరో చరిత్రపై నాదల్‌ గురి

గత వారమే మోంటెకార్లో మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ను రికార్డుస్థాయిలో పదోసారి గెలిచి చరిత్ర సృష్టించిన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ‘మరో చరిత్ర’కు విజయం దూరంలో ఉన్నాడు

పదోసారి బార్సిలోనా ఓపెన్‌లో ఫైనల్లోకి  
బార్సిలోనా (స్పెయిన్‌): గత వారమే మోంటెకార్లో మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ను రికార్డుస్థాయిలో పదోసారి గెలిచి చరిత్ర సృష్టించిన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ‘మరో చరిత్ర’కు విజయం దూరంలో ఉన్నాడు. బార్సిలోనా ఓపెన్‌లో నాదల్‌ పదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో ఫైనల్‌కు చేరుకున్న తొమ్మిదిసార్లూ నాదలే విజేతగా నిలిచాడు.

ఈసారీ గెలిస్తే రెండు టోర్నమెంట్‌లను (మోంటెకార్లో, బార్సిలోనా) పదిసార్లు చొప్పున సొంతం చేసుకున్న ఏకైక క్రీడాకారుడిగా నాదల్‌ గుర్తింపు పొందుతాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో నాదల్‌ 6–3, 6–4తో జెబలోస్‌ (అర్జెంటీనా)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)తో నాదల్‌ ఆడతాడు. రెండో సెమీఫైనల్లో థీమ్‌ 6–2, 3–6, 6–4తో ఆండీ ముర్రే (బ్రిటన్‌)పై నెగ్గాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement