స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్‌పై ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఫ్రాన్స్ దేశ మాజీ క్రీడామంత్రి రోజిలిన్ బాచెలోట్ డోపింగ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
నాదల్‌పై డోపింగ్ ఆరోపణలు
Mar 12 2016 2:09 PM | Updated on Sep 3 2017 7:35 PM
ఖండించిన స్పానిష్ ఒలింపిక్ కమిటీ
పారిస్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్‌పై ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఫ్రాన్స్ దేశ మాజీ క్రీడామంత్రి రోజిలిన్ బాచెలోట్ డోపింగ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 2012లో కొన్ని నెలలపాటు మోకాలి గాయంతో నాదల్ టెన్నిస్‌కు దూరమవడాన్ని గుర్తు చేస్తూ ఆమె ఈ ఆరోపణలు చేశారు. 2007 నుంచి 2010 వరకు రోజిలిన్ స్పెయిన్ ఆరోగ్య, క్రీడా మంత్రిగా పనిచేశారు. ‘ఏడు నెలల పాటు మోకాలి నొప్పితో నాదల్ టెన్నిస్‌కు దూరమైన విషయం మనందరికీ తెలుసు. డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలినందుకే అతడు టోర్నీలను మిస్ అయ్యాడు. టెన్నిస్ ఆటగాళ్లు ఇలా సుదీర్ఘకాలం ఆటకు దూరంగా ఉన్నారంటే వారు కచ్చితంగా డోప్ టెస్టులో పాజిటివ్‌గా తేలినట్టే. ఇలా నిరంతరం జరగకపోయినా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి’ అని రోజిలిన్ అన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను స్పానిష్ ఒలింపిక్ కమిటీ తీవ్రంగా ఖండించింది.
Advertisement
Advertisement