పటిష్టస్థితిలో దక్షిణాఫ్రికా

Proteas in complete control against Australia at Wanderers - Sakshi

 ఓవరాల్‌ ఆధిక్యం 401  

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు

జొహన్నెస్‌బర్గ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేశారు. ఆమ్లా (16), డివిలియర్స్‌ (6) త్వరగానే పెవిలియన్‌ చేరగా... మార్క్‌రమ్‌ (37; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ఎల్గర్‌ (39 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (34 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

చేతిలో 7 వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని ప్రస్తుతం 401 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 110/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా చివరకు 221 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కమిన్స్‌ (50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ జోడీ విడిపోయాకా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ కుప్పకూలింది. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ప్రత్యర్థి బౌలర్లలో ఫిలాండర్, రబడ, మహరాజ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top