2019 వరకు ధోని స్థానం ధోనిదే: సెహ్వాగ్‌ | No one can replace Dhoni till 2019 WC, says Sehwag | Sakshi
Sakshi News home page

2019 వరకు ధోని స్థానం ధోనిదే: సెహ్వాగ్‌

Aug 28 2017 1:20 AM | Updated on May 29 2019 2:49 PM

2019 వరకు ధోని స్థానం ధోనిదే: సెహ్వాగ్‌ - Sakshi

2019 వరకు ధోని స్థానం ధోనిదే: సెహ్వాగ్‌

వన్డే ప్రపంచకప్‌ (2019) వరకు ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ‘వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ బాగా ఆడుతున్నప్పటికీ అతనికి ఇంకా అనుభవం కావాలి.

వన్డే ప్రపంచకప్‌ (2019) వరకు ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ‘వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ బాగా ఆడుతున్నప్పటికీ అతనికి ఇంకా అనుభవం కావాలి. దీనికి సమయం పడుతుంది. ఏదేమైనా వరల్డ్‌కప్‌ తర్వాతే ధోని స్థానం భర్తీ అవుతుంది. ధోని పరుగులు చేసినా, చేయకపోయినా నష్టం లేదు. అప్పటిదాకా కేవలం ఫిట్‌నెస్‌తో ఉంటే చాలని ప్రార్థిద్దాం’ అని వీరూ అన్నాడు. మిడిలార్డర్, లోయర్‌ ఆర్డర్‌ను ధోనిలా నడిపించే ఆటగాడెవరూ లేరని సెహ్వాగ్‌ అన్నాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement