బుమ్రా జీవితం ఎంతో మందికి ఆదర్శం | Nita Ambani Reveals Cricket Journey of Bumrah At Sports Business Summit | Sakshi
Sakshi News home page

బుమ్రా జీవితం ఎంతో మందికి ఆదర్శం: నీతా అంబానీ

Oct 11 2019 11:41 AM | Updated on Oct 11 2019 12:05 PM

Nita Ambani Reveals Cricket Journey of Bumrah At Sports Business Summit - Sakshi

చిన్నప్పుడు నైక్‌ షూ కొనుక్కోవాలనేది బుమ్రా కోరిక.. కానీ కొనలేకపోయాడు. అప్పటికి రెండు మూడు సార్లు నైక్‌ షో రూమ్‌కు వెళ్లి ఎప్పటికైనా ఈ షూలను కొనుక్కొవాలని కలలు కనేవాడు.

హైదరాబాద్‌: టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా క్రికెట్‌ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ వెల్లడించారు. లండన్‌లో జరిగిన స్పోర్ట్స్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆమె పలు అంశాలను చర్చించారు. వివిధ క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లు​ ప్రయివేట్‌ లీగ్‌లతో ప్రపంచానికి పరిచయం అయ్యారని పేర్కొన్నారు. యువ ఆటగాళ్లు తమను తాము నిరుపించుకోవడానికి ఐసీఎల్‌, ఐపీఎల్‌ వంటి టోర్నీలు ఉపయోగపడ్డాయన్నారు. 

ఈ సందర్భంగా బుమ్రాపై నీతా అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. బుమ్రా ఐదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోవడంతో..  అప్పట్నుంచి అతడి కుటుంబం కష్టాలు ఎదుర్కొందని తెలిపారు. ప్రతిభ ఉంటే అవకాశం ఎక్కడ్నుంచి ఎప్పుడైన వస్తుందనడానికి బుమ్రా జీవితమే ఒక నిదర్శనమన్నారు. అనంతరం బుమ్రా క్రికెట్‌లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడనే దానిపై రూపొందించిన వీడియోను సదస్సుకు హాజరైన వారికి చూపించారు.

ఆ వీడియోలో.. ‘ఒక జత బట్టలు, షూలతోనే ఎన్నో రోజుల బతకాల్సి వచ్చింది. కానీ ఎవరో ఒకరు మనలో ఉన్న ప్రతిభను గుర్తిస్తారనే విశ్వాసం, నమ్మకం నా చిన్నతనం నుంచే ఉండదేది’అని బుమ్రా తెలిపాడు. ‘తొలి సారి బుమ్రాను ఐపీఎల్‌ మ్యాచ్‌లో చూసినప్పుడు నాకు నేను నమ్మలేకపోయాను. చిన్నప్పుడు నైక్‌ షూ కొనుక్కోవాలనేది బుమ్రా కోరిక.. కానీ అప్పటి ఆర్థిక పరిస్థితితో కొనలేకపోయాం. అప్పటికీ రెండు మూడు సార్లు నైక్‌ షో రూమ్‌కు పోయి షూలను చూసి ఎప్పటికైనా కొనాలని అనుకునేవాడు.. కానీ ఇప్పుడు బుమ్రా దగ్గర ఎన్నో రకాల షూ, బట్టు ఉన్నాయి’ అని బుమ్రా తల్లి దల్జీత్‌ బుమ్రా పేర్కొన్నారు. 

ఇలా బూమ్రా క్రికెట్‌ ప్రయాణానికి సంబంధించిన వీడియోను నీతా అంబాని ఆ సమావేశంలో ప్రదర్శించారు. ఈ రోజు బుమ్రా ఎంతోమంది యువతకు ఆదర్శమన్నారు. గత పదేళ్ళలో హార్దిక్ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, లాంటి ఎంతోమంది యువ ఆటగాళ్లను తెరపైకి తీసుకొచ్చామన్నారు. అదేవిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత్‌లో క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వడం గురించి నీతా అంబానీ ప్రస్తావించారు. ప్రధాని మోదీ దేశంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అనేక కార్యక్రమాలను ప్రారంభించారని. ఆయన 'ఖేలో ఇండియా', 'ఫిట్ ఇండియా’ ప్రారంభించినట్లు ఆమె గుర్తుచేశారు.

ప్రస్తుతం బుమ్రాకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోను నెటిజన్లు ఎంతగానో ఆకట్టుకోవడంతో తెగ వైరల్‌ అవుతోంది. ‘బుమ్రా నిజంగా నీకు సెల్యూట్‌’, ‘లక్ష్యం కోసం నువ్వు పడిన కష్టం మా అందరికీ ఆదర్శం’, ‘బుమ్రా నువ్వు నిజమైన చాంపియన్‌’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement