సెయిలింగ్‌లో మోహిత్‌ సైనీ హవా | Mohit Saini leads in sailing | Sakshi
Sakshi News home page

సెయిలింగ్‌లో మోహిత్‌ సైనీ హవా

Jul 5 2018 10:23 AM | Updated on Jul 5 2018 10:23 AM

Mohit Saini leads in sailing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్, సికింద్రాబాద్‌ సెయిలింగ్‌ క్లబ్, ఏజిస్‌ ఆఫ్‌ లేజర్‌ క్లాస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తోన్న సీనియర్‌ మల్టీ క్లాస్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు మోహిత్‌ సైనీ సత్తా చాటాడు. లేజర్‌ స్టాండర్డ్‌ విభాగంలో బరిలో దిగిన అతను మూడు రేసుల్లో అగ్రస్థానంలో నిలిచాడు.

ఇదే విభాగంలో ముజాహిద్‌ ఖాన్‌ మూడు రేసుల్లోనూ వరుసగా మూడో, రెండో, మూడో స్థానాలు దక్కించుకున్నాడు. కాగా వాతావరణం అనుకూలించకపోవడంతో సెయిలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వచ్చింది. బుధవారం హుస్సేన్‌ సాగర్‌ ప్రాంతంలో విపరీతమైన గాలులు వీస్తుండటంతో సెయిలర్లు తమ అత్యుత్తమ ప్రతిభను కనబర్చలేకపోయారు. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో దాన్ని తట్టుకుంటూ ముందుకు సాగడం సెయిలర్లకు కష్ట సాధ్యమైన పనిగా మారింది. ఉదయంతో పోల్చుకుంటే సాయంత్రం గాలి తీవ్రత తగ్గడంతో పోటీలు కాస్త సజావుగా సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement