ఇండియన్ వెల్స్కు షరపోవా దూరం | Maria Sharapova withdraws from Indian Wells with arm injury | Sakshi
Sakshi News home page

ఇండియన్ వెల్స్కు షరపోవా దూరం

Mar 4 2016 6:03 PM | Updated on Sep 3 2017 7:00 PM

త్వరలో కాలిఫోర్నియాలో ఆరంభం కానున్న ఇండియన్ వెల్స్ డబ్యూటీఏ టోర్నమెంట్ నుంచి మాజీ ప్రపంచ నంబర్ వన్, రష్యన్ క్రీడాకారిణి మారియా షరపోవా ముందుగానే వైదొలిగింది.

కాలిఫోర్నియా(అమెరికా):త్వరలో కాలిఫోర్నియాలో ఆరంభం కానున్న ఇండియన్ వెల్స్ డబ్యూటీఏ టోర్నీ నుంచి మాజీ ప్రపంచ నంబర్ వన్, రష్యన్ క్రీడాకారిణి మారియా షరపోవా ముందుగానే వైదొలిగింది. గత కొంతకాలంగా తనను వేధిస్తున్న ఎడమ చేతి గాయం ఇంకా తగ్గకపోవడంతో ఇండియన్ వెల్స్ కు దూరంగా కావాలని షరపోవా నిర్ణయించుకుంది.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్లో పాల్గొన్న షరపోవా క్వార్టర్ ఫైనల్లో సెరెనా విలియమ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తరువాత  ఏ టోర్నీల్లో పాల్గొనని షరపోవా.. ఈనెల 9 వ తేదీ నుంచి జరిగే ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ నుంచి కూడా వైదొలిగింది. 'ప్రస్తుతం నా గాయంపై దృష్టి పెట్టా. 100 శాతం ఫిట్గా ఉంటే ఈ టోర్నీలో పాల్గొనాలని భావించా. డబ్యూటీఏ ఈవెంట్లలో ఇదొక నా ఫేవరెట్ ఈవెంట్. కానీ గాయం ఇంకా బాధించడంతో భారంగా టోర్నీకి దూరంగా కావాల్సి వస్తుంది 'అని షరపోవా పేర్కొంది. ఈ మేరకు టోర్నీ నిర్వహకులకు గురువారం ఓ నివేదికను అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement