మనీశ్‌ కౌశిక్‌ ముందంజ | Manish Kaushik advances to second round with dominating win | Sakshi
Sakshi News home page

మనీశ్‌ కౌశిక్‌ ముందంజ

Sep 13 2019 2:37 AM | Updated on Sep 13 2019 2:37 AM

Manish Kaushik advances to second round with dominating win  - Sakshi

ఎకతెరీన్‌బర్గ్‌ (రష్యా): ప్రతిష్టాత్మక బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు, కామన్వెల్త్‌ గేమ్స్‌ రజత పతక విజేత మనీశ్‌ కౌశిక్‌ రెండోరౌండ్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల 63కేజీల బౌట్‌లో మనీశ్‌ 5–0తో ఉలూ అర్జెన్‌ కదిర్‌బెక్‌ (కిర్గిస్తాన్‌)పై విజయం సాధించాడు. మ్యాచ్‌లో తన వ్యూహాలను పక్కాగా అమలు చేసిన మనీశ్‌ పెద్దగా కష్టపడకుండానే విజయాన్ని అందుకున్నాడు. అతని పదునైన పంచ్‌లకు ప్రత్యర్థి వద్ద సమాధానమే లేకుండా పోయింది. రెండో రౌండ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన ఎన్‌రికో లాక్రూజ్‌తో మనీశ్‌ తలపడతాడు. ఈ టోర్నీలో ఇప్పటికే బ్రిజేశ్‌ యాదవ్‌ (81 కేజీలు) రెండోరౌండ్‌కు అర్హత సాధించగా.. భారత బాక్సర్లు ముగ్గురికి తొలిరౌండ్‌లో ‘బై’ లభించింది. అమిత్‌ పంగల్‌ (52 కేజీలు), కవీందర్‌ సింగ్‌ (57 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు) నేరుగా రెండోరౌండ్‌ బౌట్‌లో తలపడనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement