కోహ్లి మెరిశాడు.. | Kohli half century helps RCB to 175 | Sakshi
Sakshi News home page

కోహ్లి మెరిశాడు..

Apr 29 2018 9:42 PM | Updated on Apr 29 2018 11:24 PM

Kohli half century helps RCB to 175 - Sakshi

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఆదివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(68 నాటౌట్‌; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేయగా, బ్రెండన్‌ మెకల్లమ్‌(38;28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డీకాక్‌(29;27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)లు ఫర్వాలేదనిపించారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను మెకల్లమ్‌, డీకాక్‌లు దూకుడుగా ఆరంభించారు.  వీరిద్దరూ తొలి వికెట్‌కు 67 పరుగులు జత చేసిన తర్వాత డీకాక్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కాసేపటి మెకల్లమ్‌, మనన్‌ వోహ్రాలు వరుస బంతుల్లో ఔటయ్యారు. ఆండ్రీ రస్సెల్‌ వేసిన 10 ఓవర్‌ ఐదో బంతికి మెకల్లమ్‌ పెవిలియన్‌కు చేరగా, ఆ తదుపరి బంతికి వోహ్రా డకౌట్‌గా ఔటయ్యాడు. దాంతో 75 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్‌ను నష్టపోయింది.  ఆ తరుణంలో కోహ్లి-మన్‌దీప్‌ సింగ్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరు 65 పరుగుల జత చేసిన తర్వాత మన్‌దీప్‌ సింగ్‌(19) ఔట్‌ కాగా, గ్రాండ్‌ హోమ్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే కోహ్లి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. చివరి ఓవర్‌లో ఆర్సీబీ 16 పరుగులు పిండుకుంది. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement