కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఏబీ దూరం | De Villiers out sick, Southee in | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఏబీ దూరం

Apr 29 2018 7:51 PM | Updated on Apr 29 2018 8:04 PM

De Villiers out sick, Southee in - Sakshi

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌.. తొలుత ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది.

ఏబీ డివిలియర్స్‌, పవన్‌ నేగీ, వాషింగ్టన్‌ సుందర్‌, కోరె అండర్సన్‌లకు విశ్రాంతినిచ‍్చింది. వారి స్థానాల్లో మనన్‌ వోహ‍్రా, టిమ్‌ సౌథీ, మురుగన్‌ అశ్విన్‌, బ్రెండన్‌ మెకల్లమ్‌లు తుది జట్టులోకి వచ్చారు. అనారోగ్యం కారణంగా ఏబీ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరొకవైపు కేకేఆర్‌ జట్టులో ఎటువంటి మార్పులు లేవు. ఇరు జట్లు మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తుది జట్టు
క్వింటన్‌ డి కాక్‌‌, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), మనన్‌ వోహ్రా, బ్రెండన్‌ మెకల్లమ్‌‌, మన్‌దీప్‌ సింగ్‌, గ్రాండ్‌ హోమ్‌, మురుగన్‌ అశ్విన్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌, యుజువేంద్ర చహల్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తుది జట్టు
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఉతప్ప, నితీష్‌ రాణా, శుభమన్‌ గిల్‌, ఆండ్రూ రస్సెల్‌, శివం మావి, పియూష్‌ చావ్లా, మిచెల్‌ జాన్సన్‌, కుల్దీప్‌ యాదవ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement