‘స్విస్' ఫైనల్లో శ్రీకాంత్ | Kidambi Srikanth defeats Ajay Jayaram to reach Swiss Open final | Sakshi
Sakshi News home page

‘స్విస్' ఫైనల్లో శ్రీకాంత్

Mar 15 2015 12:53 AM | Updated on Sep 2 2017 10:51 PM

‘స్విస్' ఫైనల్లో శ్రీకాంత్

‘స్విస్' ఫైనల్లో శ్రీకాంత్

టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... భారత బ్యాడ్మింటన్ యువతార కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

బాసెల్ (స్విట్జర్లాండ్): టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ... భారత బ్యాడ్మింటన్ యువతార కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 17-21, 21-15, 21-18తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌ను ఓడించాడు.

జుయ్ సాంగ్ (చైనా), విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే టైటిల్ పోరులో శ్రీకాంత్ తలపడతాడు. జయరామ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను కోల్పోయాడు. రెండో గేమ్‌లోనూ ఒక దశలో శ్రీకాంత్ 8-12తో వెనుకబడ్డాడు. అయితే నిగ్రహం కోల్పోకండా సంయమనంతో ఆడుతూ 12-12తో స్కోరును సమం చేసిన అతను అదే జోరులో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ కీలక దశలో పైచేయి సాధించి తన కెరీర్‌లో ఐదోసారి అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్లోకి అడుగుపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement