సెమీస్‌లో కశ్యప్ | Kashyap in semis and injury puts Prannoy out | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో కశ్యప్

Apr 11 2015 1:52 AM | Updated on Sep 3 2017 12:07 AM

భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు.

గాయంతో వైదొలిగిన ప్రణయ్
సింగపూర్ ఓపెన్

 
సింగపూర్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో కశ్యప్ 21-6, 21-17తో బ్రైస్ లివర్‌డెజ్ (ఫ్రాన్స్)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ పాదం గాయంతో ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. బ్రైస్‌తో 30 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ చెలరేగిపోయాడు.

తొలిగేమ్‌లో 6-1, 9-6 ఆధిక్యం సాధించిన హైదరాబాద్ కుర్రాడు తర్వాత వరుసగా 12 పాయింట్లు నెగ్గి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ అదే జోరుతో 4-1 ఆధిక్యాన్ని సంపాదించాడు. కానీ బ్రైస్ పుంజుకొని ఆధిక్యాన్ని 7-9కి తగ్గించాడు. తర్వాత ఇరువురు ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లినా... చివర్లో కశ్యప్ మెరుగ్గా ఆడాడు. శనివారం జరిగే సెమీస్‌లో కశ్యప్... హు యున్ (హాంకాంగ్)తో తలపడతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement