ప్రపంచ కప్ అనంతరం భారత్ తొలి వన్డే సిరీస్కు సన్నద్ధమైంది.
ఢాకా: ప్రపంచ కప్ అనంతరం భారత్ తొలి వన్డే సిరీస్కు సన్నద్ధమైంది. గురువారం నుంచి బంగ్లాదేశ్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో ధోనీసేన బరిలో దిగుతోంది.
బంగ్లాదేశ్పై టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉంది. బంగ్లాతో భారత్ ఇప్పటి వరకు 29 వన్డేలు ఆడగా కేవలం మూడింటిలో మాత్రమే ఓడింది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాను ఓడించడం అంత సులువు కాదని భారత బ్యాట్స్మన్ సురేష్ రైనా అన్నాడు. బంగ్లాతో సిరీస్కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని చెప్పాడు. బంగ్లా జట్టు బలోపేతమైందని అభిప్రాయపడ్డాడు. బంగ్లాతో ఏకైక టెస్టుతో తమ ఆటతీరు పట్ల రైనా సంతోషం వ్యక్తం చేశాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్లో తొమ్మిది సెషన్లకు అంతరాయం ఏర్పడంతో వన్డేలు రిజర్వ్ దినాలు కేటాయించారు. ఏదైనా వన్డే వర్షం కారణంగా నిలిచిపోతే మరుసటి అదే స్కోరు నుంచి ఆటను కొనసాగిస్తారు.


