చివరికి విజయం పంజాబ్‌దే

IPL 2019 Kings Punjab Won By 14 Runs Against Rajasthan Royals - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్‌ పంజాబ్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా సోమవారం స్థానిక సవాయ్‌ మాన్‌సింగ్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం పంజాబ్‌నే వరించింది. పంజాబ్‌ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో  రాజస్తాన్‌ అనూహ్య ఓటమి చవిచూసింది.  భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రహానే సేనకు అదృష్టం కలసిరాలేదు. 

తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన రహానే(27) అశ్విన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శాంసన్‌తో కలిసి మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే అశ్విన్‌ బౌలింగ్‌లో బట్లర్‌(69) వివాదస్పదంగా రనౌటయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. స్టీవ్‌ స్మిత్‌(19) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించినా.. జట్టును గెలపించలేకపోయాడు. అనంతరం శాంసన్‌(30) కూడా వెంటనే ఔట్‌ అవ్వడంతో రాజస్తాన్‌ పరాజయం ఖరారైంది. పంజాబ్‌ బౌలర్లలో కర్రన్‌, ముజీబ్‌, రాజ్‌పుత్‌లు తలో రెండు వికెట్లు తీశారు. 

అంతకముందు క్రిస్‌ గేల్‌(79; 47 బంతుల్లో 8 ఫోర్లు, 4 ఫోర్లు), సర్ఫరాజ్‌ ఖాన్‌(46 నాటౌట్‌; 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించడంతో కింగ్స్‌ పంజాబ్‌ భారీ స్కోర్‌ సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఆదిలోనే కేఎల్‌ రాహుల్‌(4) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మయాంక్‌ అగర్వాల్‌-గేల్‌ జోడి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసింది. వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత మయాంక్‌(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

ఆపై సర్పరాజ్‌ ఖాన్‌తో ఇన్నింగ్స్‌ను గేల్‌ ముందుకు తీసుకెళ్లాడు.  ప్రధానంగా ఉనాద్కత్‌ వేసిన 12 ఓవర్‌లో మూడు ఫోర్లు, 1 సిక‍్సర్‌ కొట్టాడు. ఆ ఓవర్‌లో 19 పరుగుల్ని గేల్‌ సాధించాడు.  ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే అర్థ శతకం తర్వాత  గేల్‌ జోరు పెంచాడు. బెన్‌ స్టోక్‌ వేసిన 16 ఓవర్‌లో గేల్‌ 18 పరుగులు సాధించడంతో కింగ్స్‌ పంజాబ్‌ స్కోరులో వేగం పెరిగింది. కాగా, అదే ఓవర్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌కు యత్నించిన గేల్‌..బౌండరీ లైన్‌ వద్ద రాహుల్‌ త్రిపాఠీ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఆపై సర్పరాజ్‌ ఖాన్‌ సమయోచితంగా ఆడటంతో కింగ్స్‌ పంజాబ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసిం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top