చివరి టెస్ట్‌: జడేజా ఒంటరి పోరాటం

India vs England Fifth Test India All Out In First Innings - Sakshi

ఆకట్టుకున్న తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి

ఇంగ్లండ్‌కు 40 పరుగుల ఆధిక్యం

లండన్‌ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 292 పరుగులుకు ఆలౌట్‌ అయ్యింది. ఆల్‌రౌండర్‌ జడేజా 86 పరుగులతో చివరి వరకూ పోరాడి నాటౌట్‌గా నిలిచాడు. 176 పరుగులతో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్‌ను విహారి, జడేజా ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే తెలుగు కుర్రాడు హనుమ విహారి హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.  జట్టు స్కోర్‌ 237 వద్ద హనుమ విహారి (56)ని మెయిన్‌ అలీ ఔట్‌ చేశాడు. దీంతో భారత్‌ మరో ఇరవై పరుగుల లోపు ఆలౌట్‌ అవుతుందని భావించారు. కానీ జడేజా ఒంటరి పోరాటంతో భారత్‌ 292 పరుగులు చేయగలిగింది. ఇషాంత్‌ శర్మ (4) కొద్ది సేపు క్రీజ్‌లో  జడేజాకు అండగా నిలిచాడు.

ఆ తరువాత వచ్చిన షమి వెంటనే ఔటైనా.. చివరి వికెట్‌గా వచ్చిన బూమ్రా సహాయంతో జడేజా పోరాడాడు. చివరి వికెట్‌గా బూమ్రా రనౌట్‌ కావడంతో భారత్‌ ఇన్సింగ్స్‌ ముగిసింది. చివరి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం నమోదవ్వడం విశేషం. దీంతో ఇంగ్లండ్‌కు మొదటి ఇన్సింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌, స్టోక్స్‌, మోయిన్‌ అలీలకు రెండేసి వికెట్లు దక్కగా.. బ్రాడ్‌, కరణ్‌, రషీద్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top