మా భోజనంలో ఎవరో ఆ డ్రగ్స్ కలిపారు | I think someone mixed the banned substance in our meals: Sandeep | Sakshi
Sakshi News home page

మా భోజనంలో ఎవరో ఆ డగ్స్ కలిపారు

Jul 25 2016 3:28 PM | Updated on Sep 4 2017 6:14 AM

మా భోజనంలో ఎవరో ఆ డ్రగ్స్ కలిపారు

మా భోజనంలో ఎవరో ఆ డ్రగ్స్ కలిపారు

నిషేధిత ఉత్ర్పేరకాలను తాము వాడలేదని నర్సింగ్ యాదవ్, సందీప్ యాదవ్ చెబుతున్నారు.

భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రూమ్మేట్ సందీప్ తులసీ యాదవ్ కూడా డోప్ పరీక్షలో పట్టుబట్టాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షలో వీరిద్దరూ నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్టు తేలింది. అయితే నిషేధిత ఉత్ర్పేరకాలను తాము వాడలేదని నర్సింగ్ యాదవ్, సందీప్ యాదవ్ చెబుతున్నారు.

భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్, తాను ఒకే రూమ్లో ఉన్నామని, తాము తిన్న ఆహారంలో ఎవరో నిషేధిత ఉత్ప్రేరకాలను కలిపి ఉంటారని భావిస్తున్నట్టు సందీప్ చెప్పాడు. తాను డోపీగా తేలినట్టు వచ్చిన వార్త విని షాకయ్యానని చెప్పాడు. నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ తనపై కుట్ర జరిగిందని, సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశాడు. ఏనాడూ తాను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోలేదని స్పష్టం చేశాడు. అతని కోచ్ జగ్మల్ సింగ్ కూడా కుట్ర జరిగిందని ఆరోపించాడు. నర్సింగ్ యాదవ్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మద్దతుగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement