'అక్కడ మాత్రం మంచి స్కోరర్ని కాదు' | I never was a good scorer, says sachin | Sakshi
Sakshi News home page

'అక్కడ మాత్రం మంచి స్కోరర్ని కాదు'

Sep 8 2017 11:22 AM | Updated on Sep 17 2017 6:36 PM

'అక్కడ మాత్రం మంచి స్కోరర్ని కాదు'

'అక్కడ మాత్రం మంచి స్కోరర్ని కాదు'

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఆటతో క్రికెట్ కే వన్నె తెచ్చిన క్రికెటర్.

ముంబై:మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఆటతో క్రికెట్ కే వన్నె తెచ్చిన క్రికెటర్.  ఎన్నో రికార్డులను అతి సునాయాసంగా సాధించి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశారు.  ఈ క్రమంలోనే సుదీర్ఘ కాలం పాటు ఉండిపోయే రికార్డులు సచిన్ సొంతమయ్యాయి. అయితే క్రికెట్ లో ఎన్నో సాధించనప్పటికీ, చదువులో మాత్రం తాను మంచి స్కోర్ చేయలేకపోయానని సచిన్ తాజాగా తెలిపారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చిన్ననాటి ఫోటోకు 'ఐ నెవర్ వజ్ గుడ్ స్కోరర్ ఇన్ దిస్ ఫీల్డ్'అనే క్యాప్షన్ జోడించారు.


కాగా, నెటిజన్లు మాత్రం సచిన్ అభిప్రాయాన్ని స్వాగతిస్తూనే.. చదువులో మంచి స్కోర్ సాధించకపోతే ఏంటి.. నువ్వు సాధించిన రికార్డులతో నీ పేరు పుస్తకాల్లోకి ఎక్కింది. చదువులో స్కోర్ చేస్తే, ఈ రికార్డులు ఎవరు సాధించేవాళ్లు అంటూ అభిమానులు తమ అభిమానం చాటుకుంటున్నారు.



 

 

I never was a good scorer in this field. #Nostalgia #ThrowbackThursday

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement