రియో ఒలింపిక్స్‌లో తన మిక్స్‌డ్ డబుల్స్ భాగస్వామి ఎవరో ఇప్పటికే అఖిల భారత టెన్నిస్ సంఘం(ఐటా)కు చెప్పానని స్టార్.....
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో తన మిక్స్‌డ్ డబుల్స్ భాగస్వామి ఎవరో ఇప్పటికే అఖిల భారత టెన్నిస్ సంఘం(ఐటా)కు చెప్పానని స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పష్టం చేసింది. ‘ఇదివరకే నేను ఐటాతో మాట్లాడాను.
ఒలింపిక్స్ విషయంలో నా అభిప్రాయం చెప్పాను. 11న వారు సమావేశమవుతున్నారు. అప్పటి వరకు వేచి చూడాలి’ అని సానియా తెలిపింది. మిక్స్‌డ్ విభాగంలో తను రోహన్ బోపన్నతో బరిలోకి దిగే అవకాశం ఉంది.