Australian Open Mixed Doubles: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) జోడి అదరగొట్టింది. బుధవారం నాటి సెమీస్ మ్యాచ్‌లో థర్డ్ సీడ్ ద్వయం నీల్ స్కుప్స్కి(గ్రేట్ బ్రిటన్), డిసిరే(యూఎస్‌ఏ)ను ఓడించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిపై 7-6, 6-7, (10-6) తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది.
అలా సెమీస్‌కు చేరి..
ఇదిలా ఉంటే.. సానియా మీర్జా–రోహన్ బోపన్న ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జోడీతో తలపడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు.
ఇలా సెమీస్‌కు చేరుకున్న సానియా- బోపన్న జోడీ మెరుగైన ప్రదర్శనతో ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా.. బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోనూ విజయం సాధించి టైటిల్‌తో ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్‌గా సిరాజ్
ICC ODI Rankings: కోహ్లిని వెనక్కునెట్టిన గిల్.. హిట్‌మ్యాన్ ఏ స్థానంలో ఉన్నాడంటే..?
In a fitting farewell, @MirzaSania's last dance will take place on the grandest stage!
— #AusOpen (@AustralianOpen) January 25, 2023
She and @rohanbopanna 🇮🇳 have qualified for the Mixed Doubles Final!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/qHGNOvWMoC
Comments
Please login to add a commentAdd a comment