31 ఏళ్ల తర్వాత హార్దిక్‌ పాండ్యా..

Hardik Pandya repeats Kapil Dev feat after 31 years - Sakshi

విశాఖ: భారత క్రికెట్‌ జట్టులో బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌గా ప్రవేశించిన హార్దిక్‌ పాండ్యా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. భారత్‌ జట్టులో కపిల్‌ దేవ్‌ తర్వాత అత్యుత్తమ ఆల్‌ రౌండర్‌గా మన్ననలు అందుకుంటున్న హార్దిక్‌.. 31 ఏళ్ల క్రితం కపిల్‌ దేవ్‌ సాధించిన రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 500కు పైగా పరుగులు 30కు పైగా వికెట్లను హార్దిక్‌ సాధించాడు. ఫలితంగా 1986లో కపిల్‌ దేవ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రికార్డును హార్దిక్‌ రిపీట్‌ చేశాడు.

ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో హార్దిక్‌ 27 అంతర్జాతీయ వన్డేల్లో 517 పరుగులు సాధించగా, 30వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో హార్దిక్‌ ఈ ఫీట్‌ సాధించాడు. లంకేయులతో మ్యాచ్‌లో హార్దిక్‌ 49 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. తద్వారా కపిల్‌ దేవ్‌ సరసన హార్దిక్‌ నిలిచాడు. భారత వన్డే జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా కొనసాగుతున్న హార్దిక్‌.. ఈ ఏడాది జూలైలో జరిగిన శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top