భజ్జీ... బిజీ బిజీ | Harbhajan Singh & Geeta Basra make first post-wedding ... | Sakshi
Sakshi News home page

భజ్జీ... బిజీ బిజీ

Nov 1 2015 4:30 AM | Updated on Sep 3 2017 11:47 AM

పెళ్లి హడావుడి ముగిసిన తర్వాత కూడా భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంకా బిజీ బిజీగా గడుపుతున్నాడు.

నేడు ఢిల్లీలో రిసెప్షన్
న్యూఢిల్లీ: పెళ్లి హడావుడి ముగిసిన తర్వాత కూడా భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంకా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈనెల 27 నుంచి పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్న భజ్జీ ఇప్పుడు స్నేహితులకు పార్టీలు ఇవ్వడం, ఇతరత్రా అంశాలతో మరింత సందడి చేస్తున్నాడు. ఈనెల 29న పెళ్లి తంతు ముగిసిన తర్వాత 30న ఇంటికే పరిమితమైన హర్భజన్... సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. శనివారం మాత్రం ఈ వ్యవహారాన్ని పక్కనబెట్టిన స్పిన్నర్ ఢిల్లీలోని చత్తర్‌పూర్‌లో తన స్నేహితుడి ఫామ్ హౌస్‌లో పార్టీని ఏర్పాటు చేశాడు.

పసందైన విందుతో పాటు స్నేహితులకు కాక్ టెయిల్ పార్టీ ఇచ్చి అదరగొట్టాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్, కోహ్లి, యువరాజ్, ధావన్‌లు ఈ పార్టీకి హాజరైనట్లు సమాచారం. మరోవైపు ఆదివారం ఢిల్లీలో రిసెప్షన్‌కు భజ్జీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రికెటర్లు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement