దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌గా గ్రేమ్‌ స్మిత్‌

Graeme Smith appointed South Africa director of cricket till March 2022 - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) పూర్తిస్థాయి డైరెక్టర్‌గా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ శుక్రవారం నియమితుడయ్యాడు. గతేడాది డిసెంబర్‌ నుంచి తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న 39 ఏళ్ల స్మిత్‌ రానున్న రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌ఏ తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాక్వెస్‌ ఫౌల్‌ ప్రకటించారు. తాత్కాలిక డైరెక్టర్‌గా ఆరునెలల పని కాలంలో కఠిన శ్రమ, అనుభవం, అంకితభావంతో స్మిత్‌ అద్భుత ఫలితాలు సాధించాడని జాక్వెస్‌ కొనియాడారు. స్మిత్‌ 2003–14 మధ్య కాలంలో 117 టెస్టులు, 197 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 108 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పూర్తిస్థాయి డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న గ్రేమ్‌ స్మిత్‌ వచ్చీరాగానే మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం సఫారీ టెస్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి డికాక్‌ను తప్పిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top