ధోని నిర్ణయంపై మండిపడ్డ గంభీర్‌

Gautam Gambhir Slams MS Dhoni Captaincy During 2012 CB Series - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌, ఆసీస్‌, శ్రీలంకల మధ్య జరిగిన ముక్కోణపు సీబీ సిరీస్‌-2012లో తుది జట్టు ఎంపిక విషయంలో నాటి టీమిండియా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేస్తూ గంభీర్‌ మండిపడ్డాడు. ఇటీవలే అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన గౌతీ ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరి సారిగా బరిలోకి దిగాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో తన కెరీర్‌కు ఘనంగా గుడ్‌బై చెప్పాడు. అనంతరం మీడియాతో మచ్చటించాడు.

‘2015 ప్రపంచకప్‌ దృష్ట్యా యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించేందుకు ఈ ముక్కోణపు సిరీస్‌లో ఇద్దరు ఓపెనర్లనే తీసుకుంటానని కెప్టెన్‌ ధోనీ స్పష్టంజేశాడు. ధోని తీసుకున్న నిర్ణయం నన్నే కాదు ఏ క్రికెటర్‌కైనా షాక్‌కు గురి చేసేదే.. 2015 ప్రపంచకప్‌ జట్టులో ఉండబోరని 2012లో చెప్పడం నేనెప్పుడు వినలేదు. పరుగులు చేస్తున్నంత వరకూ వయసు అడ్డంకి కాదని నేను ఎప్పుడూ భావిస్తుండేవాడిని. ఈ సిరీస్‌లో హోబర్ట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి.

ఆ మ్యాచ్‌లో ధోని అనూహ్యంగా మా ముగ్గురిని ఆడించాడు. ఓపెనర్లుగా సెహ్వాగ్‌, సచిన్‌లు రాగా.. నేను, కోహ్లి మూడు, నాలుగు స్థానంలో వచ్చాం. ఆ మ్యాచ్‌లో మేం 37 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. ముక్కోణపు సిరీస్‌ ప్రారంభంలో ముగ్గురు ఓపెనర్లం ఆడలేదు. ఒకసారి ఒకరికి మరోసారి ఇంకొకరికి అవకాశం కల్పించారు. కానీ తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ముగ్గుర్నీ ధోనీ ఆడించాడు. అంటే తన నిర్ణయాన్ని అతడు మార్చుకున్నట్టే కదా. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండాలి’ అని గంభీర్‌ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ధోనిని తప్పుబట్టాడు.

చదవండి: రాజకీయాల్లోకి రాను!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top