టీమిండియా మూడో‘సారీ’

England beating India Third TIme after conceding a 1st inngs lead - Sakshi

సౌతాంప్టన్‌: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టెస్టులో పరాజయం చెందడం ద్వారా టీమిండియా సిరీస్‌ను ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కోల్పోయింది. ఆదివారం ముగిసిన నాల్గో టెస్టులో టీమిండియా 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్య ఛేదనలో చతికిలబడిన భారత్‌.. సిరీస్‌ను ముందుగానే సమర్పించుకుంది. కాగా, ఇంగ్లండ్‌పై ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించి భారత్‌ ఓటమి చెందడం ఇది మూడోసారి మాత్రమే. ఈ సిరీస్‌లో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 27 పరుగులు లభించగా, ఆపై రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని చేజ్‌ చేయలేకపోయింది.

అంతకు​ముందు 1936లో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 13 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించి భారత్‌ ఓటమి పాలు కాగా, ఆపై 2011లో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 67 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించి కూడా పరాజయం చెందింది. ఆ తర్వాత మరొకసారి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక‍్యంలో నిలిచిన భారత్‌కు ఓటమి తప్పలేదు.

తొలి టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి..

సిరీస్‌ సమర్పయామి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top