టాటా ఓపెన్‌ ఫైనల్లో దివిజ్‌–బోపన్న జంట  | Bopanna pair in the Tata Open final | Sakshi
Sakshi News home page

టాటా ఓపెన్‌ ఫైనల్లో దివిజ్‌–బోపన్న జంట 

Jan 5 2019 1:09 AM | Updated on Jan 5 2019 1:09 AM

Divya-Bopanna pair in the Tata Open final - Sakshi

పుణే: ఈ ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించేందుకు భారత టెన్నిస్‌ జంట దివిజ్‌ శరణ్‌–రోహన్‌ బోపన్న విజయం దూరంలో నిలిచింది. టాటా ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో దివిజ్‌–బోపన్న ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది.

శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ దివిజ్‌–బోపన్న జంట 6–3, 3–6, 15–13తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సిమోన్‌ బొలెలీ (ఇటలీ)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. నేడు జరిగే ఫైనల్లో ల్యూక్‌ బాంబ్రిడ్జ్‌–జానీ ఒమారా (బ్రిటన్‌)లతో దివిజ్‌–బోపన్న తలపడతారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement