ధోని సరికొత్త రికార్డు | Dhoni Creates New record after hitting 100th fifty | Sakshi
Sakshi News home page

ధోని సరికొత్త రికార్డు

Sep 17 2017 8:44 PM | Updated on Sep 19 2017 4:41 PM

ధోని సరికొత్త రికార్డు

ధోని సరికొత్త రికార్డు

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు.

సాక్షి, చెన్నై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో అర్ధ శతకం సాధించిన ధోని(79: 88 బంతుల్లో 4x4, 2x6) తన అంతర్జాతీయ కెరీర్‌లో వందో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నారు. టెస్టుల్లో 33 అర్ధశతకాలు, వన్డేల్లో 66, టీ20ల్లో ఒక అర్ధ శతకంతో ధోనీ ఈ ఘనతను అందుకున్నారు.

అంతర్జాతీయ కెరీర్‌లో ఇలా వందో అర్ధ శతకం అందుకున్న భారత క్రికెటర్ల జాబితాలో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ 164 అర్ధ శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు ఉన్నారు. తాజాగా ధోనీ నాలుగో స్థానంలో నిలిచారు. మొత్తంగా ప్రపంచంలోనే ఈ 100 అర్ధ శతకాలు అందుకున్న14వ బ్యాట్స్‌మెన్‌గా ధోని రికార్డులకెక్కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement