టెస్టు చరిత్రలోనే రెండో క్రికెటర్‌!

Dean Elgar joins Desmond Haynes in elite club  - Sakshi

కేప్‌టౌన్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఎల్గర్‌ (141 నాటౌట్‌)గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఓపెనర్‌గా వచ్చి అధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు మూడు సార్లు ఈ ఘనత సాధించిన విండీస్‌ దిగ్గజం హేన్స్‌తో సమంగా నిలిచాడు. హెన్స్‌ పాకిస్తాన్‌పై (1986లో 88 నాటౌట్‌), ఇంగ్లండ్‌పై(1991లో75 నాటౌట్‌), పాకిస్తాన్‌పై (1993లో143 నాటౌట్‌) ఈ ఘనతను అందుకున్నాడు.

ఎల్గర్‌ 48 టెస్టుల్లోనే ఈ ఘనతను సాధించడం విశేషమైతే.. ఒకే క్యాలెండర్‌ సంవత్సరంలో రెండు సార్లు సాధించడం మరో విశేషం.  భారత్‌తో జరిగిన గత సిరీస్‌ చివరి టెస్టులో ఎల్గర్‌ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక 2015లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్గర్‌(118 నాటౌట్‌)గా నిలిచి తొలి సారి ఈ ఘనతను అందుకున్నాడు. 

దేశాల వారి జాబితాను పరిశీలిస్తే  ఆస్ట్రేలియా(14) అత్యధిక సార్లు ఈ ఘనతను సాధించగా భారత్‌ నాలుగు సార్లు ఈ ఫీట్‌ను అందుకోంది. భారత్‌ నుంచి సునీల్‌ గావస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, చతేశ్వర పుజారాలు తలా ఒక సారి ఈ రికార్డు నమోదు చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top