గో డాడీ | David Warner Daughter Support Her Dad in Hyderabad Match | Sakshi
Sakshi News home page

గో డాడీ

Apr 18 2019 7:02 AM | Updated on Apr 18 2019 9:01 AM

David Warner Daughter Support Her Dad in Hyderabad Match - Sakshi

ఐపీఎల్‌ డిఫెండింగ్‌చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు హైదరాబాద్‌స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ భార్య, పిల్లలు సన్‌రైజర్స్‌ జెండాతో సందడి చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో వార్నర్‌ బ్యాట్‌తో చెలరేగి అర్ధ సెంచరీ సాధించి ప్రేక్షకులనుఅలరించాడు. 

సాక్షి, హైదరాబాద్‌ :సన్‌రైజర్స్‌ హైదరాబాద్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ ప్రేక్షకుల్లో ఫుల్‌ జోష్‌ను పంచింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ మ్యాచ్‌ కోసం టికెట్లన్నీ ఎప్పుడో అమ్ముడవడంతో మైదానం మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. సన్‌రైజర్స్, చెన్నై మద్దతుదారులతో స్టేడియం మొత్తం ఆరెంజ్, పసుపు వర్ణాలతో కళకళలాడింది. సొంతగడ్డపై జరుగుతోన్న మ్యాచ్‌ కావడంతో టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, సినీ నటులు సుమంత్, సుశాంత్‌ మ్యాచ్‌లో సందడి చేశారు. కానీ ఈ మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగకపోవడం మహి అభిమానులను ఒకింత నిరాశకు గురిచేసింది.

వీవీఎస్‌ లక్ష్మణ్‌ తనయ అచింత్య, సానియా మీర్జా, ఆనమ్‌ మీర్జా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement