సీఎస్‌కేపై స‌న్‌రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం | Chennai Super Kings vs Sunrisers Hyderabad Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2025: సీఎస్‌కేపై స‌న్‌రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం

Apr 25 2025 7:15 PM | Updated on Apr 25 2025 11:22 PM

Chennai Super Kings vs Sunrisers Hyderabad Live Updates

PC: BCCI/IPL.com

Live Updates CSK vs SRH Live Updates:

సీఎస్‌కేపై స‌న్‌రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం

ఐపీఎల్‌-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించింది. 155 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవ‌ర్ల‌లో చేధించింది. 

ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్(44) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. క‌మిందు మెండిస్‌(32 నాటౌట్‌), నితీష్ కుమార్ రెడ్డి(19 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ ఆహ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జ‌డేజా, ఖాలీల్ అహ్మ‌ద్‌, కాంబోజ్ త‌లా వికెట్ సాధించారు. 

16 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 127/5
స‌న్‌రైజ‌ర్స్ క్లాసెన్‌(7), అనికేత్ వ‌ర్మ‌(19) వికెట్ల‌ను కోల్పోయింది. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 5 వికెట్ల న‌ష్టానికి 127 ప‌రుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ విజ‌యానికి 24 బంతుల్లో 28 ప‌రుగులు కావాలి.

ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ డౌన్‌..
ట్రావిస్ హెడ్ రూపంలో స‌న్‌రైజ‌ర్స్ రెండో వికెట్ కోల్పోయింది. 19 ప‌రుగులు చేసిన హెడ్‌..అన్షుల్ కాంబోజ్ క్లీన్ బౌల్డ‌య్యాడు. 7 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్‌..రెండు వికెట్ల న‌ష్టానికి 42 ప‌రుగులు చేసింది.

ఎస్ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్‌..
155 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. ఖాలీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో అభిషేక్ శ‌ర్మ డ‌కౌట‌య్యాడు.

చెల‌రేగిన ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు.. 154 ప‌రుగులకే సీఎస్‌కే ఆలౌట్‌
చెపాక్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 19.5 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో డెవాల్డ్ బ్రెవిస్‌(42) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మాత్రే(30), ర‌వీంద్ర జ‌డేజా(21) రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప్యాట్ క‌మ్మిన్స్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌ట్ త‌లా రెండు వికెట్లు సాధించారు.

సీఎస్‌కే ఏడో వికెట్ డౌన్‌..
ఎంఎస్ ధోని రూపంలో సీఎస్‌కే ఏడో వికెట్ కోల్పోయింది. 6 ప‌రుగులు చేసిన ధోని.. హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

16 ఓవ‌ర్లకు సీఎస్‌కే స్కోర్‌:130/6
సీఎస్‌కే వ‌రుస క్ర‌మంలో బ్రెవిస్‌(42), శివ‌మ్ దూబే(12) వికెట్ల‌ను వ‌రుస క్ర‌మంలో కోల్పోయింది. హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో బ్రెవిస్ ఔట్ కాగా.. జ‌య‌దేవ్ ఉన‌ద్క‌ట్ బౌలింగ్‌లో శివ‌మ్ దూబే ఔట‌య్యాడు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 6 వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగులు చేసింది. క్రీజ‌లో ధోని(6), హుడా(8) ఉన్నారు.

సీఎస్‌కే నాలుగో వికెట్ డౌన్‌
ర‌వీంద్ర జ‌డేజా(21) రూపంలో సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. క‌మిందు మెండిస్ బౌలింగ్‌లో జ‌డ్డూ క్లీన్ బౌల్డ‌య్యాడు. 9.3 ఓవ‌ర్ల‌కు సీఎస్‌కే స్కోర్‌: 74/4
సీఎస్‌కే మూడో వికెట్ డౌన్‌
ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 30 ప‌రుగులు చేసిన మాత్రే.. ప్యాట్ క‌మ్మిన్స్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 6 ఓవ‌ర్ల‌కు సీఎస్‌కే మూడు వికెట్ల న‌ష్టానికి 50 ప‌రుగులు చేసింది. 

సీఎస్‌కే రెండో వికెట్ డౌన్‌..
సామ్ కుర్రాన్ రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగుల చేసిన కుర్రాన్‌.. హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే రెండు వికెట్ల న‌ష్టానికి 45 ప‌రుగులు చేసింది. యువ ఆట‌గాడు ఆయూష్ మాత్రే(29) దూకుడుగా ఆడుతున్నాడు. అత‌డితో ర‌వీంద్ర జ‌డేజా(6) క్రీజులో ఉన్నాడు.
సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో తొలి బంతికే షేక్ ర‌షీద్ పెవిలియ‌న్‌కు చేరాడు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే వికెట్ న‌ష్టానికి 13 ప‌రుగులు చేసింది. క్రీజులో మాత్రే(14), కుర్రాన్‌(2) ప‌రుగుల‌తో ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో కీల‌క పోరుకు రంగం సిద్ద‌మైంది. చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ డూర్ ఆర్‌డై మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది.

 తుది జ‌ట్టులోకి డెవాల్డ్ బ్రెవిస్‌, దీప‌క్ హుడా వ‌చ్చారు. ర‌చిన్ ర‌వీంద్ర‌, విజ‌య్ శంక‌ర్‌ను సీఎస్‌కే పక్క‌న పెట్టింది. మ‌రోవైపు ఎస్ఆర్‌హెచ్ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. జ‌ట్టులోకి క‌మిందు మెండిస్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ వ‌చ్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను సజీవంగా ఉంచుకుంటుంది.

తుది జ‌ట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI: డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మ్హత్రే, షేక్ రషీద్, దీపక్ హుడా, సామ్ కర్రాన్, శివమ్ దూబే, MS ధోని (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement