విండీస్‌ దృక్పథం మారాలి

Change the perspective of the West Indies - Sakshi

సునీల్‌ గావస్కర్‌

అంతకుముందు మ్యాచ్‌లో ఓడిన పరిస్థితుల్లో... వరుస టెస్టులంటే పర్యాటక జట్లకు కొంత ఇబ్బందే. సమతుల్యతను సరిచూసుకునేందుకు వారికి సమయం చిక్కదు. ఫామ్‌లో లేని ఆటగాడు వెనువెంటనే బరిలో దిగాల్సి వస్తుండగా, రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన వారికి తాజాగా పోటీ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టుల మధ్య ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఉంటే ఆటగాళ్లు ఫామ్‌ దొరకబుచ్చుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకునేందుకు వీలుంటుంది. ఈ రోజుల్లో పర్యటనలన్నీ ఊపిరి సలపలేనంతగా ఉంటున్నాయి కాబట్టి ఇది అసాధ్యం.  రాజ్‌కోట్‌ టెస్టుకు ముందు వెస్టిండీస్‌ జట్టు దుబాయ్‌లో ప్రాక్టీస్‌ చేసింది. అనంతరం బోర్డు ఎలెవెన్‌తో ప్రహసనంలాంటి రెండు రోజుల సన్నాహక మ్యాచ్‌ ఆడింది.

అయితే, తీవ్ర వైఫల్యంతో వారు అసలు ఈ స్థాయి క్రికెట్‌కు తగినవారేనా అనే ప్రశ్నలు తలెత్తాయి. భీకర ఆటతో నాలుగు రోజుల్లో వీలుంటే మూడు రోజుల్లోనే టెస్టును ముగించేసే 1970 లేదా 1990ల నాటి విండీస్‌కు పూర్తి భిన్నమైన జట్టు ఇది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగే రెండో టెస్టు నుంచి మనం ఏం ఆశించగలం? అనుభవజ్ఞులైన రోచ్, హోల్డర్‌ పునరాగమనంతో పర్యాటక జట్టు బౌలింగ్‌లో కొంత బలంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరి నుంచి జట్టు మంచి ప్రదర్శన ఆశిస్తోంది. ఏదేమైనా విండీస్‌ ఆటగాళ్ల దృక్పథంలో, ఆటతీరులో మార్పు రావాల్సిన అవసరం ఉంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top