టీ20లో మరో రికార్డు

Chamari Enthralls Sydney Crowd With Record Hundred - Sakshi

సిడ్నీ: అంతర్జాతీయ టీ20లో మరో రికార్డు నమోదైంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కా శతకంతో చెలరేగి ఛేదనలో ఈ ఫీట్‌ సాధించిన తొలి కెప్టెన్‌ రికార్డు సాధించగా, రోజు వ్యవధిలోనే మరో రికార్డు నమోదైంది. మహిళల జట్టు నుంచి శ్రీలంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు కూడా మూడంకెల స్కోరును సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచారు.  ఆసీస్‌ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక మహిళా జట్టు ఓపెనర్‌ చమరి ఆటపట్టు (66 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 113) సెంచరీతో మెరిశారు. అయితే ఆమె ఒంటి పోరాటం చేసినా లంక 41 పరుగులతో ఓటమి పాలైంది.

అంతకుముందు రోజు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఛేజింగ్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా పరాస్‌ ఖాడ్కా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సింగపూర్‌ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్య ఛేదనలో పరాస్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పరాస్‌ 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు చేశాడు. దాంతో నేపాల్‌ 16 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.  అటు తర్వాత చమరి ఆటపట్టు శతకం సాధించడంతో టీ20ల్లో మరో రికార్డు వచ్చి చేరింది. అలాగే ఈ రెండు జట్ల తరఫున కూడా శతకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. (ఇక్కడ చదవండి: టీ20లో సరికొత్త రికార్డు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top