ఐసీసీ చాలెంజ్‌: కోహ్లిని క‌నిపెట్ట‌గ‌ల‌రా? | Can you spot Virat Kohli in the sea of KL Rahuls? ICC Posts New Challenge | Sakshi
Sakshi News home page

ఐసీసీ సవాల్‌: విరాట్ కోహ్లిని క‌నిపెట్ట‌గ‌ల‌రా?

Apr 1 2020 2:21 PM | Updated on Apr 1 2020 3:06 PM

Can you spot Virat Kohli in the sea of KL Rahuls? ICC Posts New Challenge - Sakshi

లాక్‌డౌన్‌తో ఇంట్లో ఉండి బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారా? అయితే అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) విసిరిన ఛాలెంజ్‌పై ఓ లుక్కేయండి. క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ ఉన్న ఫోటో కొలైడ్‌లో విరాట్‌ కోహ్లిని గుర్తించ‌గ‌ల‌రా అంటూ ఐసీసీ బుధ‌వారం క్రికెట్ అభిమానుల‌కు ఓ సరదా ఛాలెంజ్ విసిరింది. చూడగ‌నే అస‌లు విరాట్‌కోహ్లీ ఫోటో ఇందులో ఉందా? ఏప్రిల్‌ ఫూల్ చేస్తున్నారేమో అని అనుకుంటే మీరు త‌ప్పులో కాలేసిన‌ట్లే.  కాస్త జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే విరాట్‌ కోహ్లిని మీరు క‌నిపెట్టొచ్చు.


ఐసీసీ బుధ‌వారం ట్విట్ట‌ర్‌లో ఈ పోస్ట్ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇది తెగ వైర‌ల్ అవుతుంది. మేం క‌నిపెట్టేశాం అంటూ ఇప్ప‌టికే కొంత మంది అభిమానులు విరాట్ ఉన్న విజువ‌ల్‌ను గుర్తించ‌గ‌లిగారు.
ఏంటీ... మీరు ఇంకా క‌నిపెట్ట‌లేదా?  చివ‌రి నుంచి 3వ వ‌రుస‌లో విరాట్‌ కోహ్లి ఫోటో ఉంది చూడండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement