సెంచరీతో చెలరేగిన చంద్రశేఖర్ | cambridge player chandra shekar made century | Sakshi
Sakshi News home page

సెంచరీతో చెలరేగిన చంద్రశేఖర్

Jul 20 2016 10:48 AM | Updated on Sep 4 2017 5:29 AM

సెంచరీతో చెలరేగిన చంద్రశేఖర్

సెంచరీతో చెలరేగిన చంద్రశేఖర్

కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ బి. చంద్రశేఖర్ (113 బంతుల్లో 119; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో స్పోర్టింగ్ ఎలెవన్ ఆధిక్యాన్ని తగ్గించాడు.

 కేంబ్రిడ్జ్ 342 ఆలౌట్
 ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్
సాక్షి, హైదరాబాద్: కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ బి. చంద్రశేఖర్ (113 బంతుల్లో 119; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో స్పోర్టింగ్ ఎలెవన్ ఆధిక్యాన్ని తగ్గించాడు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో మంగళవారం రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన కేంబ్రిడ్జ్ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగుల వద్ద ఆలౌటైంది. చంద్రశేఖర్ ధాటిగా ఆడాడు. తనయ్ త్యాగరాజన్ (51), మల్లికార్జున్ (50) రాణించారు.

స్పోర్టింగ్ బౌలర్లలో గౌరవ్ 4, సాత్విక్ రెడ్డి 3 వికెట్లు తీశారు. అంతకుముందు 412/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన స్పోర్టింగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యం లభించింది. నగరంలో మంగళవారం కురిసిన వర్షం వల్ల పలు మ్యాచ్‌ల రెండో రోజు ఆట రద్దయ్యింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 216, జైహనుమాన్ తొలి ఇన్నింగ్స్: 171 (సాకేత్ సాయిరామ్ 39, శాండిల్య 33; మెహదీహసన్ 6/47), ఎన్స్‌కాన్స్ రెండో ఇన్నింగ్స్: 129 (అరుణ్ 38; సాకేత్ సాయిరామ్ 5/42, తేజ 3/15), జైహనుమాన్ రెండో ఇన్నింగ్‌స: 78/3 (శశిధర్ 31).
 
 ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స్: 273, చార్మినార్ సీసీ తొలి ఇన్నింగ్స్: 206/9 (ఎస్‌కె మొహమ్మద్ 131; భగత్ వర్మ 5/104).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement