బట్లర్‌ ఔట్‌.. స్టీవ్‌ స్మిత్‌కు పగ్గాలు

Buttler out, Rajasthan opted to field Against Mumbai Indians - Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా శనివారం ఇక్కడ సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్‌ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రాజస్తాన్‌ రాయల్స్‌ ఎనిమిది మ్యాచ్‌లకు గాను రెండింట్లో మాత్రమే గెలుపొందింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం నమోదు చేసింది. దాంతో ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై ఇండియన్స్‌ భావిస్తోంది.

రాజస్తాన్‌ రాయల్స్‌ వరుస ఓటములతో సతమతమవుతున్న తరుణంలో ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ మార్పు చేసింది. ఇప్పటివరకూ కెప్టెన్‌గా వ్యవహరించిన రహానేను తప్పించి అతని స్థానంలో స్టీవ్‌ స్మిత్‌కు పగ్గాలు అప్పచెప్పింది. మరొకవైపు తాజా పోరుకు రాజస్తాన్‌ స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ దూరమయ్యాడు. బట్లర్‌ భార్య ప్రసవించడంతో అతను తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంచితే, ముంబై తరఫున గత మ్యాచ్‌లో ఆడిన జయంత్‌ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో మయాంక్‌ మార్కండే తిరిగి చోటు దక్కించుకున్నాడు.

ముంబై ఇండియన్స్‌
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌, బెన్‌ కట్టింగ్‌, రాహుల్‌ చహర్‌, మయాంక్‌ మార్కండే, లసిత్‌ మలింగా, బుమ్రా

రాజస్తాన్‌ రాయల్స్‌
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), సంజూ శాంసన్‌, రహానే, బెన్‌ స్టోక్స్‌, ఆస్టన్‌ టర్నర్‌, స్టువర్ట్‌ బిన్నీ, రియాన్‌ పరాగ్‌, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, జయదేవ్‌ ఉనాద్కత్‌, ధావల్‌ కులకర్ణి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top