
బాక్సర్లకు అభినందన
ఎల్బీ స్టేడియం: మహారాష్ట్రలోని అకోలాలో ఇటీవల జరిగిన వన్డే బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన తెలంగాణ బాక్సర్లను రాష్ట్ర క్రీడలు...
ఎల్బీ స్టేడియం: మహారాష్ట్రలోని అకోలాలో ఇటీవల జరిగిన వన్డే బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన తెలంగాణ బాక్సర్లను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి లవ్ అగర్వాల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, అంతర్జాతీయ మాజీ బాక్సర్ ఆర్‌పీకే సింగ్, రాష్ట్ర బాక్సింగ్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు ఐదు స్వర్ణాలు, 8 రజత పతకాలతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. జి.నరేష్ గౌడ్, పి.మహేందర్, సంతోష్, మనోజ్ రెడ్డి, ఎం.డి.మోసిన్ పసిడి పతకాలు గెలువగా, టి.శ్రీకాంత్, ఎస్.సాయి, ఎం.డి. ఇమ్రాన్, జాహెద్, క్లింటన్, ఎన్.రాజ్, ఎన్.శ్రీనివాస్, సి.హెచ్.ధీరజ్ రజత పతకాలు నెగ్గారు.