భార్గవికి రెండు పతకాలు | bhargavi got two medals | Sakshi
Sakshi News home page

భార్గవికి రెండు పతకాలు

Feb 17 2017 10:51 AM | Updated on Sep 5 2017 3:57 AM

భార్గవికి రెండు పతకాలు

భార్గవికి రెండు పతకాలు

ఖేలో ఇండియా జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి కె. భార్గవి సత్తా చాటింది.

జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ


సాక్షి, హైదరాబాద్‌: ఖేలో ఇండియా జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి కె. భార్గవి సత్తా చాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో భార్గవి సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో రెండు పతకాలను సాధించింది. గురువారం జరిగిన అండర్‌–14 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో గెలుపొందిన భార్గవి స్వర్ణ పతకాన్ని సాధించగా... డబుల్స్‌ విభాగంలో భార్గవి– శిఖా జోడీ కాంస్యాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో ఏపీకి చెందిన ఎన్‌. జాహ్నవి– ఆకాంక్ష జంట రజతాన్ని గెలుచుకుంది.

 

మరోవైపు అండర్‌–17 విభాగంలోనూ రితిన్‌ రెండు పతకాలతో రాణించాడు. రితిన్‌ సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను సాధించాడు. టీమ్‌ విభాగంలో జరిగిన పోటీల్లో అండర్‌– 17 బాలుర విభాగంలో ఏపీ, తెలంగాణ జట్లు తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. అండర్‌–14 విభాగంలో ఏపీ బాలుర జట్టు అగ్రస్థానంలో నిలవగా.... తెలంగాణ బాలికల జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement