సుప్రీం తీర్పు అమల్లో వేగం పెంచుతాం: రాయ్‌ | BCCI told new statute must be in place before September AGM | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పు అమల్లో వేగం పెంచుతాం: రాయ్‌

Jul 2 2017 1:11 AM | Updated on Sep 2 2018 5:24 PM

బీసీసీఐ ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో జాప్యం జరుగుతుండటాన్ని పలువురు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

ముంబై: బీసీసీఐ ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో జాప్యం జరుగుతుండటాన్ని పలువురు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో వేగం పెంచుతామని పరిపాలక కమిటీ చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ తెలిపారు.

‘లోధా ప్యానెల్‌ ప్రతిపాదనల అమలు కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీపై మాకు ఎలాంటి అసంతృప్తి లేదు. బోర్డు ఎస్‌జీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం చేయాల్సింది చేస్తాం. అక్టోబర్‌ 31 వరకు మా పని పూర్తవుతుందని ఆశిస్తున్నాం. కొత్త నియమావళి ప్రకారం ఆఫీస్‌ బేరర్లు ఎంపికవుతారు’ అని రాయ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement