ట్రయల్‌ బ్లేజర్స్‌ గీ సూపర్‌ నోవాస్‌ 

BCCI announce squads for Women T20 Challenge match - Sakshi

ఈ నెల 22న మహిళల టి20 చాలెంజ్‌ మ్యాచ్‌  

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌కు ముందు జరిగే మహిళల చాలెంజ్‌ టి20 మ్యాచ్‌ కోసం బీసీసీఐ గురువారం జట్లను ప్రకటించింది. ఈ నెల 22న ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌ ట్రయల్‌ బ్లేజర్స్, ఐపీఎల్‌ సూపర్‌ నోవాస్‌ పేర్లతో జట్లు తలపడనున్నాయి. ట్రయల్‌ బ్లేజర్స్‌కు స్మృతి మంధాన, సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌లుగా వ్యవహరించనున్నారు. ఈ రెండు జట్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లకు చెందిన పలువురు అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. మొత్తం 26 మంది ప్లేయర్లను రెండు జట్ల కోసం ఎంపిక చేశారు. ఇందులో 10 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

ఐపీఎల్‌ ట్రయల్‌ బ్లేజర్స్‌: స్మృతి మంధాన (కెప్టెన్‌), అలీసా హీలీ (వికెట్‌ కీపర్‌), సుజీ బెట్స్, దీప్తి శర్మ, బెత్‌ మూనీ, జెమీమా రోడ్రిగ్స్, డానియల్‌ హజెల్, శిఖా పాండే, లీ టహుహు, జులన్‌ గోస్వామి, ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్, హేమలత.

ఐపీఎల్‌ సూపర్‌ నోవాస్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), డానియెల్లి వ్యాట్, మిథాలీ రాజ్, మెగ్‌ లానింగ్, సోఫీ డివైన్, ఎలైస్‌ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, పూజా వస్త్రాకర్, మెగన్‌ షుట్, రాజేశ్వరి గైక్వాడ్, అనూజ పాటిల్, తానియా భాటియా (వికెట్‌ కీపర్‌).   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top