బంగ్లా వన్డే సిరీస్ కు డివిలియర్స్ దూరం | AB de Villiers left out of South Africa squad for Bangladesh ODIs | Sakshi
Sakshi News home page

బంగ్లా వన్డే సిరీస్ కు డివిలియర్స్ దూరం

Jul 8 2015 5:02 PM | Updated on Sep 3 2017 5:08 AM

బంగ్లా వన్డే సిరీస్ కు డివిలియర్స్ దూరం

బంగ్లా వన్డే సిరీస్ కు డివిలియర్స్ దూరం

దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ బంగ్లాదేశ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు దూరమయ్యాడు.

ఢాకా: దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ బంగ్లాదేశ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. హషిమ్ ఆమ్లా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. డివిలియర్స్ స్థానంలో లెగ్ స్పిన్నర్ ఎడీ లీని జట్టులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో స్లో ఓవర్ రేటు కారణంగా డివిలియర్స్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించింది.

వరల్డ్ కప్ నుంచి నిష్ర్కమించిన తర్వాత బంగ్లాదేశ్ తో తొలి వన్డే సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్ లో డివిలియర్స్ పై నిషేధం అమలు కానుంది. అయితే కుటుంబం గడిపేందుకు సమయం కావాలని అడగడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అతడికి విశ్రాంతి నిచ్చింది. ఇటీవలే ప్రసవించిన తన భార్యను కలుసుకునేందుకు డివిలియర్స్ స్వదేశానికి పయనమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement