వైరల్‌ : విమానంలో షూ ఆరబెట్టాడు | Passenger Uses Flight Air Vent To Dry Their Shoe Became Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ : విమానంలో షూ ఆరబెట్టాడు

Jan 17 2020 4:18 PM | Updated on Jan 17 2020 8:06 PM

Passenger Uses Flight Air Vent To Dry Their Shoe Became Viral - Sakshi

ఒక్కోసారి ప్రయాణికులు చేసే పని కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే మరికొన్ని సార్లు  చిరాకు తెప్పిస్తుంది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే విషయం పట్టించుకోకుండా వాళ్లు తమ పని కానిచ్చేస్తారు. తాజాగా విమానంలోని ఎయిర్‌ వెంట్‌ను ఒక ప్రయాణికుడు ఉపయోగించిన విధానం​ చూస్తే ఎవరికైనా వెగతు పుట్టిస్తుంది. ఇంతకీ అతను చేసిన పనేంటో తెలుసా.. తన కాలికున్న షూను తీసి చేతిలో పట్టుకొని విమానంలోని ఎయిర్‌ వెంట్‌ కింద ఆరబెట్టాడు.

దీంతో షూలో ఉన్న దుర్వాసన మొత్తం విమానం అంతా వ్యాపించడంతో తోటి ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. ఇతరులు ఏమనుకుంటారో అనే విషయం పట్టించుకోకుండా అతను తన షూను ఆరబెట్టడం ఏంటని తోటి ప్రయాణికులు వాపోయారు.  అయితే ఇదంతా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ' షూలో ఉండే సువాసనను అందరికి పంచడానికే అతను ఈ పని చేసి ఉంటాడు' అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇతరులు ఏమనుకుంటారో అన్న ద్యాసే లేకుండా అతను ఇలా ప్రవర్తించడం ఏం బాగా లేదని మరొకరు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement