గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి | man dies with electric shock while flag hoisting | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి

Jan 27 2018 8:16 PM | Updated on Jun 4 2019 5:04 PM

man dies with electric shock while flag hoisting - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు

కోహెడ(హుస్నాబాద్‌): కోహెడలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుం ది. బస్వాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లికి చెందిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బస్వాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లికి చెందిన గొట్టే చంద్రయ్య(42) 20 సంవత్సరాల క్రితం హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో అవుట్‌సోర్సింగ్‌ ద్వారా విధుల్లో చేరాడు. బస్వాపూర్‌ చెక్‌ పోస్టులో సై తం సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వహించారు. కోహె డ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు అనంతరం కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

కోహెడ వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం గణతంత్ర వేడుకలకు జాతీయ జెండా ఏర్పాటు చేస్తున్నాడు. జెండా కోసం సిద్ధం చేసిన ఇనుమ పైపు ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌కు గురై చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

సమాచారం అందుకున్న హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రూ.5 లక్షలు విద్యుత్‌ శాఖ ద్వారా, మరో రూ.5 లక్షలు వ్యవసాయ మార్కెట్‌ శాఖ నిధుల నుంచి బాధిత కుటుంబానికి అందే విధంగా కృషి చేస్తామన్నారు. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి పంపిణీ చేయాలని ఆర్డీఓ శంకర్‌కుమార్‌ను కోరారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. ఎస్‌ఐ చాంద తిరుపతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి నాగేశ్వర్‌శర్మ, పెర్యాల రవీందర్‌రావు, దేవేందర్‌రావు, ఎంపీపీ ఉప్పుల స్వామి, జెడ్పీటీసీ సభ్యుడు పొన్నాల లక్ష్మయ్య, కోహెడ పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కర్ర శ్రీహరి, తైదాల రవి, వైస్‌ చైర్మన్లు కోల్ల రాంరెడ్డి, తోట ఆంజనేయులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement