‘ఉప ఎన్నికలకు మేము సిద్ధం’ | YSRCP MP yv subba reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘ఉప ఎన్నికలకు మేము సిద్ధం’

May 28 2018 11:35 AM | Updated on Mar 9 2019 3:59 PM

YSRCP MP yv subba reddy slams chandrababu naidu - Sakshi

వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, ఒంగోలు: తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రేపు సాయంత్రం లోకసభ స్పీకర్‌ను కలువనున్నట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజీనామాలు ఆమోదించండి లేదా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి’ అనేదే తమ నినాదమన్నారు. రాజీనామాలు చేసి ఇన్ని రోజులవుతున్నా ఆమోదించకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి మానసింగా సిద్ధమయ్యారన్నారు. 

మరోవైపు జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు కోట్లు రూపాయలు కమిషన్‌ రూపంలో దండుకున్నారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజక్టు డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్న సీఎం మాటలు హాస్యాస్పదమని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టును జాప్యం చేస్తూ జిల్లా ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ తర్వలో పాదయాత్ర చేయనున్నట్టు వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement