
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఆమె చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడుతోపాటు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
రాజోలు, కాకినాడ సిటీ, రామచంద్రపురంల్లో షర్మిల ప్రచారం..
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, కాకినాడ సిటీ, రామచంద్రాపురం నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.