రేపు కర్నూలు, కడప అనంతలో ప్రచారం | ys jagan to campaign in three districts tomorrow | Sakshi
Sakshi News home page

రేపు కర్నూలు, కడప అనంతలో ప్రచారం

Mar 17 2019 7:02 PM | Updated on Mar 17 2019 7:03 PM

ys jagan to campaign in three districts tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. తొలిరోజు ప్రచారంలో ఆయన ఆదివారం విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండో రోజు సోమవారం ఆయన మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, వైఎస్సార్‌, అనంతపురం జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ ప్రచారం చేస్తారు. 

సోమవారం ఉదయం 9 గంటలకు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లులో, 12 గంటలకు అనంతపురం జిల్లా రాయదుర్గం, మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement