‘చంద్రబాబూ.. నీ కరెంట్‌ పోయింది’

Vijaya Sai Reddy Fires On Chandrababu Naidu - Sakshi

ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి సెటైర్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : ‘చంద్రబాబూ.. నీ కరెంట్‌ పోయింది. అందుకే తిక్కతిక్కగా మాట్టాడుతున్నారు’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంట్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు.. ఇప్పుడేమో సైకిల్‌ చైన్‌ ముట్టుకుంటే కరెంట్‌ షాక్‌ కొడతుందంటున్నాడని, అసలు ఫ్యూజులు ఎగిరిపోయి ఆయన కరెంటే పోయిందని, అందుకే తిక్కతిక్కగా మాట్లాడుతున్నారని సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు. శనివారం వరుస ట్వీట్లతో చంద్రబాబుపై ఆయన ధ్వజమెత్తారు. ‘ఐదేళ్లలో అమరావతిలో ఒక వీధి కూడా పూర్తికాలేదు. ఇంకో ఐదేళ్లు అవకాశం ఇస్తే 20 హైదరాబాద్‌లు కడతాడట. అంతా గ్రాఫిక్స్ లోనే కదా.! 200 హైదరాబాద్‌ల గ్రాఫిక్స్ తయారు చేయించండి. సిగ్గు లేకుండా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నాడు. చేసిన మాయలు చాలు తప్పుకోండని ప్రజలు ఛీకొడుతున్నారు. 

ఫిర్యాదు చేశాం.. పట్టించుకోలేదు..
నారాయణ, భాష్యం, కెఎల్, గీతమ్ యూనివర్సిటీలు, టీడీపీ అనుకూల సంస్థల సిబ్బంది అంతా డబ్బుపంపిణీలో బిజీగా ఉన్నారు. నెల్లూరులో నారాయణ ఉద్యోగులు రూ.38 లక్షలతో పట్టుబడ్డారు. పోలీసులే డబ్బు తరలిస్తున్నారని ఎలక్షన్ కమిషన్‌కు ఇంతకు ముందే ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోలేదు. మీ బంధువు, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర్రావును ఎలక్షన్ కమిషన్ విధులను నుంచి తప్పిస్తే గుండెలు బాదుకుని కోర్టు కెళ్లావు. హైకోర్టు కర్రు కాల్చి వాత పెట్టింది. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు చంద్రబాబూ. ఈసీకి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన జీఏడీ ముఖ్య కార్యదర్శిపై కూడా చర్య తీసుకోవాలి. తెలుగుదేశం ఎన్నికల ప్రచారానికి హాజరైన వారికి పోలీసు కానిస్టేబుళ్లు, ఇంటెలిజెన్స్ సిబ్బంది డబ్బులు పంచుతున్న వీడియో వైరల్ గా మారింది. కార్యకర్తల టీ షర్టులను బట్టి పలాసలో జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయాలను అధ:పాతాళానికి నెట్టేసిన నికృష్టుడిగా చరిత్రలో మిగిలి పోతావు చంద్రబాబూ..

జనసునామీని చూడు చంద్రబాబూ..
వినుకొండ, పాయకరావుపేట, పార్వతీపురం, మండపేట, ముమ్మిడివరం ఇలా ఎక్కడికెళ్లినా జగన్ గారి సభలకు పోటెత్తుతున్న జనసునామీని చూడు చంద్రబాబూ. అనుకుల మీడియా చూపించకున్నా సోషల్ మీడియా హోరెత్తి పోతోంది. చలవ పందిళ్లలో కుర్చీలు వేసినా వందల మంది కూడా కనిపించట్లేదు నీ సోది వినడానికి.’ అని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top